హైదరాబాద్:జులై 01
తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కారు చర్యలు తీసుకుం టోంది. రేవంత్ సర్కార్.ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచనకు శ్రీ కారం చుట్టింది.ఉచిత ప్రయాణం లబ్ధిదారు లకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉచిత ప్రయాణ లబ్ధిదారు లకు ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకు రానుంది.ఇప్పటి వరకు వివిధ వర్గాల కు అందజేస్తున్న బస్ పాస్ మాదిరిగానే ఈ మహాలక్ష్మి పథకంకు సంబంధించిన స్మార్ట్ కార్డులు కూడా జారీ చేస్తారు. వీటిని కూడా మరింత స్మార్ట్‌గా మార్చేం దుకు ప్రయత్నాలు సాగు తున్నాయి.
Posted inSTATE