హైదరాబాద్:జులై 24 నేపాల్‌లోఈరోజు ఘోర విమాన ప్రమాదం జరగింది. ఖాట్మాండు ఎయిర్‌పోర్టులో టేకాఫ్ సమయంలో విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకు న్నా ఫలితం లేకుండా పోయింది.టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనే విమానం నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.