ఆషాఢ శుద్ధ పూర్ణిమని ‘గురు పూర్ణిమ” లేదా ‘వ్యాస పూర్ణిమ’ అని అంటారు.

ఆషాఢ శుద్ధ పూర్ణిమని ‘గురు పూర్ణిమ” లేదా ‘వ్యాస పూర్ణిమ’ అని అంటారు.

ఆషాఢ శుద్ధ పూర్ణిమని ‘గురు పూర్ణిమ” లేదా ‘వ్యాస పూర్ణిమ’ అని అంటారు. పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాస మహర్షినే మొదటగా పూజిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించడమే కాదు… ఒక పండుగ లాగా కూడా జరుపుకుంటారు.హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది.శ్లో. “గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధక:
అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:”

‘గు’ అంటే అంధకారం/చీకటి అని అర్థం. ‘రు’ అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక ఒక గురువు గుప్తంగా వుంటాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ:, పితృదేవోభవ:, ఆచార్యదేవోభవ: అన్నారు. అంటే తల్లితండ్రుల తర్వాత అంతటిస్థానాన్ని పొందేది గురువే.శ్లో. గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃగురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కతి మనది. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.

గురిపూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము?

ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేసాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాడ పౌర్ణమి రోజు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.ఈ రోజునే వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.పురాణాల ప్రకారం, వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహా భారతాన్ని మనకు అందించిన వ్యాసుడు అవతరించిన రోజు కాబట్టి ఈరోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తున్నారు.”వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషమ్
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః”నారాయణుడు, ఆయన నాభికమలం నుండి జన్మించిన బ్రహ్మ, బ్రహ్మ మానసపుత్రుడు వశిష్టుడు, వశిష్టుడి సంతానమైన శక్తి, శక్తి మహర్షి పుత్రుడు పరాశరుడు, పరాశరాత్మజుడు వ్యాసుడు, ఆయన కుమారుడు శుకుడు, ఆ పరంపరలో గౌడపాదాచార్యులు, గోవిందయోగి మొదలైనవారు మనకు గురువులు. వీరిలో వ్యాసుడు సాక్షాత్తూ విష్ణు స్వరూపం. అటువంటి వ్యాస భగవానుడికి భక్తితో నమస్కరిద్దాం.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరిస్తూ, బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలోని గురు గ్రహం పరబ్రహ్మ స్వరూపం. గురు పూర్ణిమ రోజున జరిపే ప్రత్యేక పూజలు, జప, హోమ, దాన ధర్మాదికాలు, ఆధ్యాత్మిక చింతనలు గురుబలాన్ని పెంచుకొనేందుకు, జీవితంలో సకల శుభాలు పొందేందుకు సులువైన మార్గాలు.గురు పూర్ణిమ రోజున వీలైనంత వరకు దక్షిణా మూర్తి ఆరాధన చేయడం, దత్తాత్రేయ ఆరాధన చేయడం మంచిది. శ్రీహయగ్రీవాయ నమః జపం చేసుకోవడం శుభదాయకం. లోకాస్సమస్తా స్సుఖినోభవంతు— వేద విజ్ఞాన సమితి

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *