ఈరోజు మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని కటెదాన్ పార్టీ కార్యాలయంలో రాజేంద్ర నగర్ నియోజక వర్గ contested MLA, డివిజన్ కార్పొరేటర్ శ్రీ తోకల శ్రీనివాస్ రెడ్డి గారు GHMC విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని కొత్తగా నిధులు మంజూరై పెండింగ్ లో ఉన్న నూతన స్ట్రీట్ లైట్స్, మరియు పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని కార్పొరేటర్ గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అదే విధంగా డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులూ తలెత్తకుండా విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గారు అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్తు డిపార్ట్మెంట్ స్ట్రీట్ లైట్ ఇన్స్పెక్టర్ సురేందర్ , శ్రీకాంత్, మహేందర్, రవీందర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Posted inMANDAL