బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి మరోసారి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
మోదీ మంత్రి వర్గంలో చేరేందుకు ఆయన తన పదవిని వదులుకుంటారని చర్చ నడుస్తోంది.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది.
ఈ క్రమంలో నితీశ్‌కు మోదీ 3.0 కేబినెట్లో చోటు కల్పించి బిహార్‌లో బీజేపీ అభ్యర్థిని సీఎం చేయనున్నట్లు సమాచారం.
ఇదే విషయమై ఇవాళ ఢిల్లీలో కాషాయపార్టీ పెద్దలతో నితీశ్ చర్చించినట్లు తెలుస్తోంది.