మన ఊరి న్యూ జూన్ 20 మిర్యాలగూడ: పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాలకు జిల్లా సబ్ కలెక్టర్ నియామకం చేయడం మిర్యాలగూడ జిల్లా కోసం చేసిన పోరాట ఫలితమేనని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి స్టీరింగ్ నాయకులు మాలోథ్ దశరథ్ నాయక్, మారం శ్రీనివాస్, మాడుగుల శ్రీనివాస్,బెజ్జం సాయి లు చెప్పారు. జూన్ 20న సాయంత్రం మిర్యాలగూడలో విలేఖర్లతో మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సంవత్వరంపైగా ఉద్యమం చేసినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో అన్ని జిల్లా ఏర్పాటు కోసం హామీ ఇచ్చాయని అందులో బాగంగా పరిపాలన సౌలభ్యం పేరుతో సబ్ కలెక్టర్ ను నియమించడంతో ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులో వస్తాయని చెప్పారు.సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో అని సమస్యలు మిర్యాలగూడలో పరిష్కారం కావాలని కోరారు.సబ్ కలెక్టర్ నియామకం పట్ల మిర్యలగూడ జిల్లా సాధన సమితి హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షోయబ్,నాగభూషణం, జయరాజు,సైదులు,మహేష్, తిరుపతయ్య, యాదగిరి,చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Posted inBlog