భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవముగా కన్ను లపండువగా నిర్వహించనున్నామని .భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ‘ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ
చైర్మన్ గాజుల అంజయ్య అన్నారు, ఆదివారం మీర్ ఆలం మండి లోని కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు జులై 7వ తేదీన గోల్కొండ అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలతో ప్రారంభమవుతాయి. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు వడి బియ్యం సమర్పించనున్నాం. జులై 10వ తేదీన బల్కంపేట ఎల్లమ్మతల్లికి, 12న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, జులై 14వ తేదీన విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి, జులై 18న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, 23వ తేదీన చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి, 25వ తేదీన శ్రీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బంగారు పాత్రలో బంగారు బోనం మరియు వడి బియ్యం సమర్పించనున్నామన్నారు,
పాతబస్తీలో ఉత్సవాలు అన్ని దేవాలయాల్లో జులై 19వ తేదీన కలశస్థాపన, ధ్వజరోహనతో ప్రారంభమవుతున్నాయి. జులై 21వ తేదీన శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి వివిధ దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో అమ్మవారి ఘటస్థాన సామూహిక ఊరేగింపు జరుగుతుంది. లాల్ దర్వాజ మోడ్ వద్ద ఏర్పాటు చేసే స్వాగత వేదిక నుంచి పలువురు అధికార, అనధికార ప్రముఖులు అమ్మవారి ఘటాలకు స్వాగతం పలుకనున్నారు. జులై 28వ తేదీన పాతబస్తీలోని అన్ని దేవాలయాలలోని అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన దేవాలయాల అమ్మవార్లకు సంబంధిత మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం 29వ తేదీన పాతబస్తీ ప్రధాన వీధుల్లో సామూహిక ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగించనున్నాము. ఈసారి బోనాల జాతర ఉత్సవాలకు ఇప్పటి నుంచే కార్యాచరణను రూపొందించుకొని తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు
Posted inSTATE