అల్వాల్ జూన్ 23 : చొప్ప0-దం₹డి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. గురువారం రాత్రి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న రేవంత్.. రూపాదేవి చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సత్యం, ఆయన పిల్లలు యోజిత్, రుషికశ్రీలను ఓదార్చారు. సీఎంను చూడగానే సత్యం భోరుమంటూ విలపించారు. సీఎం వెంట ఆయన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉన్నారు.
Posted inDISTRICT