రెండు దశాబ్దాల కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగాలైన, డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ ( కేంద్రము ) , రాష్ట్రాల చేనేత జౌళి శాఖల కమిషనర్లు, రాష్ట్రాల చేనేత సహకార సంఘాల పాలకవర్గము, సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సంబంధిత శాఖల మంత్రులు, కార్పోరేట్ టెక్స్టైల్ మిల్లుల యాజమాన్యాలతోనూ, పవర్ మగ్గాల యాజమాన్యాలతోనూఏకమై, కోట్లాది రూపాయలు ముడుపులు పొంది, చేనేత చట్టం 85 ప్రకారం, చేనేతకు కేటాయించిన 11 రకాల వస్త్రాలను పవర్ మగ్గాలపై ఉత్పత్తి చేసుకొనుటకుచేసుకొనుటకు అనధికారికంగా అనుమతి ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలోని 30 లక్షల చేనేత మరియు అనుబంధ కార్మికుల కుటుంబాల జీవనోపాధిని పోగొట్టి వేలాది కార్మికుల ఆకలి చావులకు ఆత్మహత్యలకు కారణమైనారు.
చేనేత చట్టం ఉల్లంఘనలకు పాల్పడి పవర్ మగ్గాలపై ఉత్పత్తి చేసిన యాజమాన్యాలపై, అధికారులపై, అమ్మకాలు జరుపుతున్న విక్రయశాలల యాజమాన్యాలపై మరియు ఎగుమతి దారులపై ప్రాసిక్యూషన్కుఅనుమతినిచ్చి జైలుకు పంపే ప్రొవిజన్ ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు చర్య తీసుకోలేదు,
కావున ముఖ్యమంత్రి గారు చేనేత చట్ట ఉల్లంఘనకు పాల్పడిన ఐఏఎస్ అధికారులైన, పలుకుబడి కలిగిన పవర్ మగ్గాల యాజమాన్యాలైన వదలకుండా చట్టప్రకారం చర్య తీసుకుని, చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే చేనేత వృత్తి కార్మికులు ఓటు హక్కు కలిగి మొత్తం ఎన్ డి ఏ కు ఓట్లు వేసి గెలిపించినందుకు వారి హక్కులను కాపాడి చేనేత సంబంధిత చట్టాలను రక్షించి వారికి పూర్తి వృత్తి పనులు కల్పించవలసినదిగా మరియు వారిని ఆకలి చావులు ఆత్మహత్యల నుండి కాపాడవలసినదిగా కోరుచున్నాను.
గౌరవ అభినందనలతో
ఏవీ రమణ రిటైర్డ్ డి ఎం ఓ ఆప్కో,
ప్రెసిడెంట్,
నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్.